: త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ
పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ విషయాన్ని ఆనం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. త్వరలోనే భారీ సంఖ్యలో ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇందులో భాగంగా 2,291 ఎస్సై పోస్టులు, 736 కానిస్టేబుళ్ల నియామకాలకు త్వరలోనే ప్రకటన విడుదల చేస్తారు. ఇంకా, పోలీస్ శిక్షణా సంస్థల ఆధునికీకరణకు 200 కోట్లు కేటాయిస్తామని ఆనం తెలిపారు. మొత్తంగా వివిధ శాఖల్లో ఈ ఏడాది 27,903 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వెల్లడించారు.