: ముగ్గురు కేరళ సీపీఎం నేతలకు జీవిత ఖైదు
కేరళకు చెందిన సీపీఎం నేత టీపీ చంద్రశేఖరన్ హత్య కేసులో ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలకు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో మొత్తం పన్నెండు మందిని న్యాయస్థానం నిందితులుగా తేల్చింది. వీరిలో 11 మందికి జీవితఖైదు విధించింది. జీవితఖైదు పడిన వారిలో కిల్లర్ గ్యాంగుకు చెందిన ఏడుమంది, మరో వ్యక్తి కూడా ఉన్నారు. 2012, మే 4న చంద్రశేఖరన్ పై దాడి చేసి హత్య చేశారు.