: వడ్డీరేట్ల బాంబు పేల్చిన రాజన్ బాబు
భారతీయ రిజర్వ్ బ్యాంకు చైర్మన్ రఘురామ్ రాజన్ మరోసారి వడ్డీ రేట్ల టపాకాయ పేల్చారు. రెపో రేటును 0.25 శాతం పెంచుతూ.. జర్క్ ఇచ్చారు. దీంతో రెపో రేటు 8 శాతానికి చేరింది. రివర్స్ రెపో, నగదు నిల్వల నిష్పత్తిని ముట్టుకోలేదు. ఈ మేరకు రఘురామ్ రాజన్ మూడో త్రైమాసిక ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించారు. బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు వద్ద తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీ రేట్లను రెపో రేటుగా చెబుతారు. ఈ రేటును స్వల్పంగా పెంచినందున బ్యాంకులపై భారం పెరుగుతుంది. ఫలితంగా వడ్డీ రేట్లు తగ్గకపోగా, పెరిగే అవకాశాలు ఉంటాయి. స్వల్పకాలంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. నిజానికి రాజన్ ఈసారి పరపతి విధానంలో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తారని అందరూ భావించారు. కానీ, తాను అంచనాలకు అందని రాజన్ ను అని ఆయన మరోసారి తెలియజెప్పారు.