: సెల్ ఫోన్ల లోపల 27 కేజీల బంగారం


రవాణావిమానం.. హాంగ్ కాంగ్ నుంచి సెల్ ఫోన్లను తీసుకొని చెన్నై విమానాశ్రయంలో ఈ ఉదయం వాలింది. అయితే, ఆ ఫోన్లు మాట్లాడుకునేందుకు మాత్రం ఉపయోగపడవు. ఎందుకంటే, వాటిలోపల ఉన్నదంతా బంగారమే. అలా 27 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్లలో బంగారం.. అలాంటి సెల్ ఫోన్లు ఉన్న బాక్సులు ఎన్నో ఆ విమానంలో దిగుమతయ్యాయి. పంపిన వారి వివరాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బంగారం విలువ 8 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

  • Loading...

More Telugu News