: సిరిసిల్లను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలి: విద్యాసాగర్ రావు
కరీంనగర్ జిల్లాలో ఉన్న సిరిసిల్లను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతికి తెలంగాణ బిల్లుపై అధికారం లేదని ముఖ్యమంత్రి అంటున్నారని... ఆయన అపరిచితుడు సినిమా మాదిరి ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.