: తాండూరు బీజేపీ అభ్యర్థిగా సబిత సోదరుడు?


ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో గెలుపు గుర్రాల కోసం బీజేపీ అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా, తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో మాజీ హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డి సోదరుడు నర్సింహారెడ్డికి బీజేపీ గాలం వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర స్థాయి కీలక నేత ఒకరు మంతనాలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. టికెట్ విషయంలో కచ్చితమైన హామీ లభిస్తే... బీజేపీ తరఫున బరిలోకి దిగడానికి నర్సింహారెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారని... ఆయన అనుచరులు అంటున్నారు.

  • Loading...

More Telugu News