: కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న జేసీ
కాంగ్రెస్ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న తాడిపత్రి ఎమ్మెల్యే, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి... ఈ రోజు రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కార్యదర్శి సదారాంకు ఆయన నామినేషన్ పత్రాలు అందజేస్తున్నారు. మూడు రోజుల క్రితమే జేసీ రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికలలో గెలుపొందేందుకు మద్దతు ఇవ్వాల్సిందిగా జేసీ ఇప్పటికే పలువురు నేతలను కోరారు. రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం జేసీ నామినేషన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.