: రాజ్యసభకు నటుడు మిథున్ చక్రవర్తి నామినేషన్
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు పెయింటర్ జోగెన్ చౌదరి, సీపీఎం అభ్యర్థి ఒకరు, ఎస్ఎఫ్ఐ నుంచి మరొకరు స్థానిక రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం మిథున్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. బెంగాల్ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేందుకు తనవంతు ప్రయత్నిస్తానని తెలిపారు.