: ముషారఫ్ కు స్వల్ప ఊరట
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. అధికారంలో ఉండగా న్యాయమూర్తులను నిర్బంధంలో ఉంచారన్న కేసు విచారణలో... పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు కోర్టు హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఇస్లామాబాద్ లోని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ముషారఫ్ ఆరోగ్య పరిస్థితిని న్యాయస్థానం దృష్టికి అతని తరపు న్యాయవాది తీసుకురావడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేసును ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు.