: జార్ఖండ్‌లో పేలుళ్ళు: 12మంది జవాన్లకు గాయాలు


జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధ్ జిల్లాలో నక్సల్స్ ఇవాళ (సోమవారం) పేలుళ్లకు పాల్పడ్డారు. నక్సల్స్ అపహరించుకుపోయిన నలుగురు వ్యక్తుల కోసం గాలిస్తున్న 12 మంది భద్రతా సిబ్బంది పేలుళ్లలో గాయపడ్డారు. నలుగురు రాష్ట్ర పోలీసులు, ఎనిమిది మంది పారామిలిటరీ సిఆర్ పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. పోలీసులకు చెందిన జాగ్వార్ బృందం, సిఆర్పీఎఫ్ జవాన్లతో కూడిన సంయుక్త బృందంపై దాడి జరిగింది. పరశ్‌నాథ్ పర్వత సానువుల్లో ఉన్న నవకనియా గ్రామం సమీపంలో శనివారం సాయంత్రం నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారును మావోయిస్టులు అడ్డుకుని వారిని అపహరించుకుపోయారు.

  • Loading...

More Telugu News