: వసూళ్లు పుంజుకుంటున్న సల్మాన్ 'జై హో'!


నటుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'జై హో' వసూళ్లపరంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. కథాపరంగా కొంతవరకు అభిమానులు నిరాశపడ్డా నెమ్మదిగా ఆదరిస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజు రూ.17.75 కోట్లు వసూలు చేసి సల్మాన్ దూకుడుని తగ్గించింది. రెండో రోజు కొంచెం తగ్గి రూ.16.68 కోట్లు రాబట్టింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టించదు కానీ, 60 కోట్ల వరకు వసూలు చేయవచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News