: నిరాహారదీక్ష విరమించిన ఆప్ బహిష్కృత నేత


ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్ని సామాజిక కార్యకర్త అన్నా హాజారే సలహాతో నిరాహారదీక్ష విరమించారు. ఏఏపీ నేతృత్వంలో ఏర్పడ్డ ఢిల్లీ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన బిన్ని.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన హామీలను నెరవేర్చలేదని.. విద్యుత్తు, మంచినీటి విషయంలో కొంతవరకే హామీలను అమలు చేశారని అన్నారు. దానిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ మేరకు జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల కిందట బిన్ని దీక్ష చేపట్టి... ఇచ్చిన హామీలను కేజ్రీవాల్ ప్రభుత్వం పది రోజుల్లో నెరవేర్చాలని డిమాండు చేశారు.

  • Loading...

More Telugu News