: తపాలా శాఖ ఏటీఎంలు వస్తున్నాయ్


కొత్తగా భారత తపాలా శాఖకు చెందిన ఏటీఎంలు వస్తున్నాయ్. పోస్టల్ శాఖ బ్యాంకింగ్ రంగంలోకి వచ్చేందుకు రిజర్వు బ్యాంకు అనుమతి కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఏటిఎంలు ఏర్పాటు చేస్తున్నట్టు పోస్టల్ శాఖ ప్రకటించింది. మొదటి దశలో భాగంగా ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో ఫిబ్రవరి 5 నుంచి ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వచ్చే 18 నెలల కాలంలో దేశంలో 3 వేల ఏటీఎంలను నెలకొల్పనున్నట్టు పోస్టల్ శాఖ అధికారులు చెప్పారు. దీంతో పోస్టల్ సేవింగ్స్ ఖాతాలున్న 26 కోట్ల మందికి ప్రయోజనం కలుగనుంది.

  • Loading...

More Telugu News