: లగడపాటిపై మండిపడ్డ ఎంపి రాజయ్య
అభివృద్ధితోనే కాంగ్రెస్ పార్టీ సహకార సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిందని ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించడం... వాపును చూసి బలుపనుకోవడం లాంటిదని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రాజయ్య విమర్శించారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి వుంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని నమ్మేవాళ్లమని ఆయన అన్నారు. లగడపాటి చిలక జోస్యం మాని రాజకీయాలపై దృష్టి పెడితే బాగుంటుందని రాజయ్య ఎద్దేవా చేశారు.