: ముఖ్యమంత్రి నోటీసు ఉపసంహరించుకోవాలి: గండ్ర
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన నోటీసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, శాసనసభలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తమకు మంచి చేస్తాయని టీడీపీ అనుకోవడం సరికాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరిస్తే తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని గండ్ర హెచ్చరించారు.