: అందరూ అందుబాటులో ఉండాలి.. టీడీపీ ఎమ్మెల్యేలను ఆదేశించిన చంద్రబాబు
చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశం ముగిసింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని ఈ భేటీలో బాబు తమ ఎమ్మెల్యేలకు సూచించారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఎమ్మెల్యేలందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.