: సభానాయకుడిగా సీఎంకు నోటీసిచ్చే అధికారం ఉంది: బొత్స
విభజన బిల్లును తిప్పి పంపాలన్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మద్దతు పలికారు. శాసనసభ ఆవరణలో ఆయన మాట్లాడుతూ, సభానాయకుడిగా ఎలాంటి నోటీసైనా ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రులకు అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలియజేయవచ్చని లేదా సభలో చెప్పుకునే అవకాశం ఉందని బొత్స తెలిపారు.