: ముసాయిదా బిల్లు, అసలు బిల్లు ఒకటేనని కేంద్రం లిఖిత పూర్వకంగా చెప్పాలి: సీఎం
ముసాయిదా బిల్లు, అసలు బిల్లు ఒక్కటేనన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా స్పష్టం చేయాల్సి ఉందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి జైరాం రమేష్ బిల్లుపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యాఖ్యలా? అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. బిల్లుపై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పకుండా శాసనసభ అభిప్రాయం చెప్పమంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లునే అసెంబ్లీకి పంపాలని, అప్పుడు అసెంబ్లీ కోరిన సవరణలు కోరితే పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.