: కార్మికుల చేతుల నరికివేతపై ఆంధ్ర, ఒడిశాలకు సుప్రీం నోటీసులు
పని చేయనన్న ఇద్దరు కార్మికుల చేతులను కాంట్రాక్టరు నరికివేసిన ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఒడిశాలోని కలహండి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ పరామే గత డిసెంబర్ లో డైలునియాల్(19), నిలాంబర్ మజిహి(35) అనే ఇద్దరు కార్మికులను ఛత్తీస్ గఢ్ లో ఇటుకల పనికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కాంట్రాక్టర్ వద్ద చెరో రూ. 14వేలు తీసుకున్న వారిద్దరూ.. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కు వెళ్లడానికి నిరాకరించారు. దీంతో కాంట్రాక్టర్ పరామే, అతడి ఐదుగురు సహాయకులు కలిసి కార్మికులు ఇద్దరిని సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు. వారిద్దరి కుడి చేతులను నరికివేశారు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తలను సుప్రీంకోర్టు స్వచ్చంద కేసుగా విచారణకు తీసుకుని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది.