: తెలంగాణ నేతల ఆందోళనతో శాసనసభ రేపటికి వాయిదా
వాయిదా అనంతరం శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్ద తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నేతలు నినాదాలు చేశారు. వీరికి పోటీగా సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభ నిర్వహణకు సహకరించాల్సిందిగా సభ్యులను కోరారు. అయితే స్పీకర్ విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఆందోళన కొనసాగిస్తుండడంతో సభాపతి నాదెండ్ల మనోహర్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.