: దక్షిణ కొరియాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు


దక్షిణ కొరియాలో భారతీయులు ఆదివారం నాడు అక్కడి భారతీయ ఎంబసీ, భారతీయ సాంస్కృతిక కేంద్రం వద్ద 65వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంబాసిడర్ విష్ణు ప్రకాష్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎంబసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వందలాది మంది భారతీయులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసారు.

సియోల్ లోని హోటల్ హిల్టన్ మిలీనియం వద్ద అంబాసిడర్ ఆతిథ్యమిచ్చిన ఒక కార్యక్రమంతో జనవరి 23న గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కొరియా అధికారులు, పారిశ్రామికవేత్తలు, సాంస్కృతిక, విద్యావేత్తలు, మీడియా ప్రతినిధులు, కొరియాలో భారతీయ కంపెనీల ప్రతినిధులతో పాటు 400కు పైగా అతిథులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News