: టీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్.. సీపీఐ, బీజేపీ వాకౌట్


శాసనసభలో బడ్జెట్ ప్రవెశపెట్టకుండా సభాకార్యకలాపాలకు అడ్డు పడుతుండడంతో టీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సహకరించాలని స్పీకర్ ఎంతగా కోరినా టీఆర్ఎస్ సభ్యులు వినిపించుకోకుండా పోడియం వద్దకు చేరి, తెలంగాణపై తీర్మానం చేయాలంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంతో సభాపతి ఈ చర్య తీసుకున్నారు.

కేటీఆర్, సోమారపు సత్యన్నారాయణ, ఈటెల, భిక్షపతి, జూపల్లి, ఓదేలు, జోగు రామన్న, గంప గోవర్దన్, హరీశ్ రావు, చెన్నమనేని రమేశ్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, విజయ్ భాస్కర్ తదితరులు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఇక తెలంగాణపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీపీఐ, బీజేపీ సభ నుంచి వాకౌట్ చేశాయి.

  • Loading...

More Telugu News