: బంగారంపై నియంత్రణలను మార్చిలో సమీక్షిస్తాం: చిదంబరం
బంగారం దిగుమతులపై విధించిన ఆంక్షలను మార్చి చివరలో సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. అయితే, కరెంటు ఖాతా లోటు పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. లోటు పెరిగిపోతుందనే ఆందోళనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని మూడు సార్లు పెంచి 10 శాతం చేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో కంటే బంగారం ధర దేశీయంగా 30 శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో భారతీయులు బంగారం కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.