: సీఎంను బర్తరఫ్ చేయాలని గవర్నర్ ను కలుస్తాం: దామోదర


సీఎం కిరణ్ పై డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మరోసారి మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత మంత్రులను సీఎం బేఖాతరు చేస్తున్నారని, కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డిని సభానాయకుడిగా తాము భావించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని కోరుతూ ఈ సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను కలుస్తామని తెలిపారు. శాసనసభలో స్పీకర్ పోడియంను తెలంగాణ మంత్రులు చుట్టుముట్టారంటే... వారంతా పరోక్షంగా ప్రభుత్వంలో లేమని చెప్పినట్టేనని తెలిపారు.

  • Loading...

More Telugu News