: ప్రజలు అనుకుంటే ఏదయినా సాధ్యమే: వెంకయ్యనాయుడు
ప్రజలు తలుచుకుంటే ఏదయినా సాధ్యమేనని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. చిత్తురులో ఆయన మాట్లాడుతూ, ప్రజలు దేశ రాజకీయ నాయకత్వంలో మార్పును కోరుకుంటున్నారని అన్నారు. సామాజిక సైట్లలో కాంగ్రెస్ నేతలు నోటు ఓటు అనే రీతిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ బహిరంగసభల్లో బిర్యానీ, మద్యం, డబ్బు పంచి జనాలని తెప్పిస్తుంటారని... మోడీ వస్తున్నారనగానే పదేసి రూపాయలు చెల్లించి మరీ ప్రజలు వచ్చారని ఆయన గుర్తుచేశారని అన్నారు. 29న విజయవాడలో 'మోడీ ఫర్ పీఎం' కార్యక్రమం భారీ బహిరంగ సభతో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అలాగే అనంతపురంలో కూడా 'మోడీ ఫర్ పీఎం' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.