: నిరాహార దీక్షకు దిగిన బిన్నీ


తనను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ నిరాహార దీక్షకు దిగారు. బహిష్కరిస్తున్నట్లు పార్టీ నుంచి అధికారిక సమాచారం అందలేదని, మీడియా ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలిసిన తర్వాత బాపూ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. అనంతరం జంతర్ మంతర్ వద్దకు వెళ్లి బిన్నీ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఢిల్లీ ప్రభుత్వం తన పాలనా తీరును మార్చుకుని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News