: రాష్ట్రపతికి మరో లేఖ రాయాలని సీఎం నిర్ణయం
విభజన బిల్లుపై చర్చించేందుకు గడువును మరింత పెంచాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి కిరణ్ నిర్ణయించారు. సభను తెలంగాణ ప్రాంత నేతలు పదేపదే అడ్డుకుంటున్నారని, అందువల్ల చర్చకు సమయం సరిపోదని, దీంతో మరింత గడువు పెంచాలని లేఖలో పేర్కొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీమాంధ్ర మంత్రులతో జరిగిన భేటీలో నిర్ణయించారు. తెలంగాణ మంత్రులు సభాకార్యకలాపాలను అడ్డుకోవడంపై ఈ భేటీలో సీమాంధ్ర మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో బిల్లును ఓడించడానికి అవసరమైన వ్యూహ, ప్రతివ్యూహాలపై చర్చించారు. శాసనసభలో ఇకపై రెండంచెల వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.