: రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలపై రూ. 22,938 అప్పు


'అప్పు చేసి పప్పుకూడు తినరా ఓ నరుడా' అని సినీ కవి ఎప్పుడో చెప్పాడు.. దాన్నే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయి. అప్పులు చేయడం.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం. ఇప్పటి పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం ఇదే. అంటే మనపై అప్పు తీసుకుని మనకోసం ఖర్చు చేస్తున్న వైనం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రుణాలు 1.94లక్షల కోట్లు అని రిజర్వ్ బ్యాంకు తాజాగా ప్రకటించింది. దీన్ని రాష్ట్ర జనాభాతో లెక్కిస్తే.. ప్రతి ఒక్క తలపై రూ. 22,938గా ఉన్నట్లు తేలుతోంది. వాస్తవానికి మన రాష్ట్ర బడ్జెట్ ప్రకారం రుణాలు.. 1.79లక్షల కోట్లు. కానీ రిజర్వ్ బ్యాంకు మాత్రం రూ. 1.94కోట్లుగా పేర్కొంది.

  • Loading...

More Telugu News