: 'హసీ తో ఫాసీ'లో శ్రీపాద చిన్మయి గాత్రం
తెలుగుతో పాటు పలు భాషల్లో తన గాత్రంతో కట్టిపడేస్తున్న శ్రీపాద చిన్మయి మరో హిందీ సినిమాలో పాడే అవకాశం దక్కించుకుంది. 'హసీ తో ఫాసీ' సినిమాలో శేఖర్ రావుజియానితో కలిసి పాడనున్నట్లు చిన్మయి తెలిపింది. చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ రాణిస్తోంది. 'హసీ తో ఫాసీ' కరణ్ జోహార్, అనురాగ్ కాశ్యప్ సంయుక్త నిర్మాణంలో రానుంది. శేఖర్ తో చిన్మయికి ఇది రెండో అవకాశం. గతంలో 'బటర్ ఫ్లై'లో శేఖర్ తో కలిసి తొలిసారిగా పాడింది.