: ముఖ్యమంత్రితో భేటీ అయిన సీమాంధ్ర మంత్రులు
సీఎం కిరణ్ తో సీమాంధ్ర ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. టీబిల్లును వెనక్కి తిప్పి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ స్పీకర్ కు నోటీసిచ్చిన తర్వాత సీమాంధ్ర నేతల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో, ఇకపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీమాంధ్ర మంత్రులు సీఎంతో చర్చిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టకుండా చూసేందుకు వ్యూహం రచిస్తున్నారు.