: గగనంలోనూ ఉచితంగా నెట్ విహారం
గగనంలో ప్రయాణిస్తూనే.. నెట్ లోనూ విహారం చేసే సౌలభ్యం మరింతగా దేశీయ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. నెట్ సర్ఫింగ్ సౌకర్యాన్ని వైఫై ద్వారా ప్రయాణికులకు ఉచితంగా అందించాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది. దీనికి సంబంధించిన సాంకేతిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఎయిర్ ఇండియా చైర్మన్ రోహిత్ నందన్ ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించారు. ఇప్పటికే కొన్ని విదేశీ విమానయాన సంస్థలు నెట్ సర్ఫింగ్ కు అవకాశం కల్పిస్తున్నాయి. అందుకు కొంత చార్జీ వసూలు చేస్తున్నాయి. కానీ, మనదేశానికి చెందిన విమానయాన సంస్థలు దీనికి దూరంగా ఉన్నాయి. అలాంటిది ఎయిర్ ఇండియా ఉచితంగా అందించే ప్రయత్నాలు చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.