: కేబినెట్ లో చర్చించకుండా నోటీసు ఎలా ఇస్తారు?: ఎర్రబెల్లి


టీబిల్లును వెనక్కి తిప్పి పంపాలంటూ సీఎం కిరణ్ నోటీసు ఇవ్వడంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి ఏ హోదాలో నోటీసు ఇచ్చారో స్పష్టం చేయాలని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. "నోటీసు ఇచ్చేముందు కనీసం కేబినెట్ లో చర్చించాల్సిన అవసరం కూడా లేదా?" అంటూ ప్రశ్నించారు. బిల్లును వెనక్కి పంపడానికి సీఎం నోటీసు ఇస్తే... తెలంగాణ ప్రాంత మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. టీమంత్రులకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి, గవర్నర్ లను కలసి ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News