: సీఎం సాంకేతిక కారణాలను తెరమీదికి తెస్తున్నారు: మర్రి శశిధర్ రెడ్డి
విభజన బిల్లును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాంకేతిక కారణాలను తెరమీదికి తెస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ముసాయిదా బిల్లులో శాసనసభ సీట్ల పెంపు విషయాన్ని ఎలా విస్మరించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ, సీమాంధ్రల్లో సీట్ల పెంపు విషయంపై అధిష్ఠానంతో చర్చిస్తున్నామని ఆయన తెలిపారు.