: తల్లిదండ్రులకు పిల్లలే గురువులు!


తల్లిదండ్రులకు పిల్లలే గురువులు! ఏంటీ, వినడానికి వింతగా ఉందా? అవునండీ... ఇదే నిజమని పరిశోధకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సాధారణంగా పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం పడుతుంది. లేటెస్టుగా పిల్లల ప్రభావం తల్లిదండ్రుల మీద పడుతోందని అమెరికాలో ఓ సర్వే రుజువు చేసింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తల్లిదండ్రుల కంటే పిల్లలే మెరుగ్గా ఉన్నారని, దీంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ఆశ్రయిస్తున్నట్టు డియాగోపోర్టేల్స్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

శాస్త్రసాంకేతిక రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై 30 నుంచి 40 శాతం మంది తల్లిదండ్రులు వారి పిల్లలపైనే ఆధారపడ్డారని సర్వే తెలిపింది. అతి కొద్ది మంది మాత్రమే సొంతంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారని సర్వే వెల్లడించింది. అయితే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో విషయ పరిజ్ఞానం పెంచుకోవాలనే తాపత్రాయం పెరుగుతోందని సర్వే తెలిపింది.

  • Loading...

More Telugu News