: ముఖ్యమంత్రితో కాంగ్రెస్ నేతల భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లును వెనక్కి తిప్పి పంపాలన్న అంశంపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, శైలజానాథ్, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ఎంపీ లగడపాటి తదితరులు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. రాజ్యసభ అభ్యర్థిత్వాలు సహా, పునర్విభజన ముసాయిదా బిల్లుపై వీరు చర్చించారు.