: తెలంగాణ రావాలి...సీమాంధ్రులకు న్యాయం జరగాలి: బాబా రాందేవ్
తెలంగాణ రావడం అనివార్యమని, అదే సమయంలో సీమాంధ్రులకు న్యాయం జరగాలని బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున ఇంటింటి ప్రచారం చేపడతానని ప్రకటించారు. మోడీకి దేశవ్యాప్తంగా మద్దతు పెంచి, ప్రధాని సీట్లో కూర్చోబెడతానని ఆయన శపథం చేశారు. ముస్లింల ఓట్లు రాబట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుయుక్తులకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.