: రెండో టీట్వంటీలో సత్తా చూపిన టీమిండియా
శ్రీలంకతో విజయనగరంలో జరిగిన రెండో టీట్వంటీలో భారత మహిళల జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు జులన్ గోస్వామి, శర్మ, సోనియా డాబిర్ లు తలా 23 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేయగలిగింది. అనంతరం 128 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేయగలిగింది. దీంతో మూడు టీట్వంటీల సిరీస్ లో తలో మ్యాచ్ గెలిచి రెండు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి.