: 'బాద్ షా' చిత్ర నిర్మాత బండ్ల గణేష్ పై పోలీస్ కేసు
'బాద్ షా' చిత్ర నిర్మాత బండ్ల గణేష్ పై పోలీసు కేసు నమోదైంది. నిన్న రాత్రి ఈ సినిమా ఆడియో వేడుక సందర్భంగా హైదరాబాదు శివారు నానక్ రామ్ గూడా రామానాయుడు సినీ విలేజ్ లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వరంగల్ జిల్లా ఉరుసుగుట్టకు చెందిన రాజు అనే అభిమాని మరణించాడు. ఈ సంఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో చిత్ర నిర్మాత, తదితరులపై 304(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇదిలావుంచితే, మృతుని కుటుంబానికి నిర్మాత నాటి వేడుకలో ఐదు లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించారు.