: ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం కానున్న రాజకీయ పార్టీ


ఆమ్ ఆద్మీ పార్టీకి దేశ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోతున్నారు. ఉత్తరాదిలో పార్టీ పెట్టి అధికారం హస్తగతం చేసుకున్న ఆప్ పట్ల దక్షిణాదిలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన సర్వోదయ పార్టీ ఆప్ లో విలీనం కావడానికి, పూర్తి మద్దతు తెలుపడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై తుది నిర్ణయం ఫిబ్రవరి మొదటి వారంలో తీసుకోనున్నారు. సర్వోదయ పార్టీని పలు దళిత, రైతు సంఘాలు ఏర్పాటు చేశాయి.

  • Loading...

More Telugu News