: సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యా: విద్యాబాలన్
పద్మశ్రీ అవార్డుకు తనను ఎంపిక చేశారని తెలిసిన వెంటనే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని ప్రముఖ నటి విద్యాబాలన్ అన్నారు. ఎంతో సంతోషించానని.. దానిని చెప్పడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి మాటలు రావడం లేదన్నారు. ఇది తనకెంతో గర్వకారణంగా చెప్పారు. ఈ అవార్డును తనకోసం ఎంతో చేసిన కుటుంబ సభ్యులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. 2005లో 'పరిణీతి' చిత్రంతో తెరంగేట్రం చేసిన విద్యాబాలన్ పా, ఇష్కియా, నో వన్ కిల్డ్ జెస్సికా, కహానీ చిత్రాల ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా ఆ మధ్య వచ్చిన 'డర్టీ పిక్చర్' తో విద్యా పాప్యులర్ అయిపోయింది. దానిలో నటనకు గాను జాతీయ అవార్డును కూడా అందుకుంది.