: ఐఏఎస్ అవ్వాలనుకున్న యువతిపై ఐఏఎస్ అధికారి అత్యాచారం
ఐఏఎస్ అవడం ఆమె స్వప్నం. అందుకోసం పోటీ పడుతోంది. దాన్ని అవకాశంగా తీసుకున్నాడో దుష్టుడు. బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారి అయి ఉండి ఔత్సాహిక ఐఏఎస్ అభ్యర్థిని మోసగించాడు. ఐఏఎస్ పరీక్ష రాయడంలో సహకారం అందిస్తానని హామీ ఇచ్చి పలుమార్లు ఆ యువతితో లైంగిక కార్యంలో పాల్గొన్నాడు. ఏడాది ఆలస్యంగా ఆ కామ ఐఏఎస్ అధికారిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జైపూర్ పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఐఏఎస్ అధికారి మొహంతి తనపై గతేడాది ఫిబ్రవరిలో స్వేజ్ ఫామ్ హౌస్ లో పలుసార్లు అత్యాచారం చేశాడని 23 ఏళ్ల బాధిత యువతి ఫిర్యాదు చేసింది. 58 ఏళ్ల మొహంతి ప్రస్తుతం రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఉన్నారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మొహంతి మాత్రం ఆరోపణలను అసత్యాలుగా కొట్టిపడేశారు.