: మృతుడి కుటుంబానికి అండగా ఉంటా: జూనియర్ ఎన్టీఆర్


'బాద్ షా' ఆడియో వేడుక సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అభిమాని కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. రాజు చనిపోవటం చాలా బాధాకరమని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. నిర్మాత బండ్ల గణేష్ బాదితుని కుటుంబానికి 5లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. అభిమానులంతా జాగ్రత్తగా ఇండ్లకు చేరుకోవాలని కోరుతూ, నిర్ణీత సమయంకంటే ముందుగానే వేడుకను ముగించారు.

ఇదిలా ఉండగా, బాద్ షా ఆడియోవేడుక ఈ రాత్రి గచ్చిబౌలీలోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.  ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ తోపాటు ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి శాలిని కూడా హాజరుకావటం విశేషం. కార్యక్రమం ప్రారంభానికి ముందు, ఆడియో రిలీజ్ కు మధ్యలోనూ ఏర్పాటు చేసిన ప్రత్యేక నృత్య రీతులు  ఆహుతులను అలరించాయి.

దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత బండ్ల గణేష్ అతిధులను సాదరంగా ఆహ్వానించారు.  ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు వివి వినాయక్, కొరటాల శివ, కోన వెంకట్, రామ్ ఆచంట, గోపి ఆచంట, రామజోగయ్య శాస్త్రి, బివిఎస్ఎస్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News