: మిఠాయిలు విక్రయించనున్న హర్భజన్
బౌలర్ హర్భజన్ సింగ్ గుర్తున్నాడు కదూ..? అతడు స్వీట్లు విక్రయించబోతున్నాడు. ఏం పాపం అంత కర్మేం వచ్చింది... డబ్బులకేం కొదవ? అనుకుంటున్నారా? డబ్బుల కోసం కాదండీ. టీవీ షో కోసం బజ్జీ ఈ వేషం కడుతున్నాడు. ప్రముఖులు ఒక రోజు సామాన్యుల్లా బతకడం అనే కాన్సెప్ట్ తో కలర్స్ చానల్ 'మిషన్ సప్నే' అనే కార్యక్రమాన్ని రూపొందించింది. అందులో భాగంగానే బజ్జీ ఒకరోజు ఇంటింటికీ తిరిగి స్వీట్లు విక్రయిస్తాడు. దీన్ని కలర్స్ చానెల్ ప్రసారం చేస్తుంది. బజ్జీ ఒక్కడే కాదు, త్వరలో ఈ కార్యక్రమంలో బాలీవుడ్, క్రికెట్, టీవీ సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో రోజు సామాన్యుల్లా దర్శనమివ్వనున్నారు.