: క్రైస్తవ పాస్టర్లకు మావోయిస్టుల హెచ్చరిక


క్రైస్తవ పాస్టర్లకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. గిరిజన గ్రామాల్లో క్రైస్తవ మత వ్యాప్తికి పని చేస్తున్న పాస్టర్లు ఆయా గ్రామాలు వదిలేసి తక్షణం తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని, లేనిచో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ శబరి ఏరియా కమిటీ పేరుతో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో పోస్టర్లు వెలిశాయి. గిరిజన గ్రామాల్లో పోలీసులే పాస్టర్లను ఏర్పాటు చేసి, వారిని ఇన్ఫార్మర్లుగా ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు.

ఈ పద్దతికి తక్షణం చరమగీతం పాడాలని, అలాగే గిరిజనులు కూడా క్రైస్తవ మతం స్వీకరించవద్దని వారు ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. అలాగే మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణాన్ని ఆపేయాలని, లేనిచో చోటుచేసుకునే పరిణామాలకు జిల్లా ఎస్పీ, కలెక్టర్లు బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. గ్రీన్ హంట్ పేరిట గిరిజన గ్రామాల్లో పోలీసుల మోహరింపును వెనక్కి తీసుకోవాలని, బైండోవర్ కేసులు పెట్టడం మానేయాలని పోస్టర్లలో మావోలు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News