: వచ్చే గణతంత్రదిన వేడుకలు కూడా సమైక్య రాష్ట్రంలోనే: అశోక్ బాబు
వచ్చే గణతంత్రదిన వేడుకలు కూడా సమైక్యాంధ్రప్రదేశ్ లోనే జరుగుతాయని ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. సమైక్యం కోసం అందరూ ఏకమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా సమైక్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.