: శాసనసభ, మండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
శాసనసభ, శాసనమండలిలో 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. అనంతరం మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ చక్రపాణి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో పలువురు ఎమ్మెల్సీలు, సిబ్బంది పాల్గొన్నారు .