: కాంగ్రెస్ ఎంపీలతో సోనియా సమావేశం
పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల వ్యూహాలకు, ప్రతివ్యూహాలు సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా నడుంబిగించారు. ఇందుకోసం తమ పార్టీ ఎంపీలతో రేపు భేటీకానున్నారు. ఐక్యరాజ్యసమితిలో శ్రీలంకకు వ్యతిరేకంగా వ్యవహరించాలని, లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తానని డీఎంకే అధినేత కరుణానిధి హెచ్చరించిన నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత చేకూరింది. హెలికాప్టర్ల కుంభకోణం, శ్రీలంక వివాదం.. తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.