: తెలుగు తేజాల మధ్య సూపర్ ఫైట్
తెలుగు తేజాలు సైనా నెహ్వాల్, పీవీ సింధుల మధ్య రేపు రసవత్తర పోరు జరుగనుంది. ఇండియన్ గ్రాండ్ ప్రీ గొల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్ లో వీరిద్దరూ తలపడనున్నారు. ఈ రోజు (శనివారం) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లలో తమ ప్రత్యర్థులపై సైనా, సింధులు గెలుపొందడంతో, టైటిల్ పోరుకు వీరిద్దరూ సిద్ధమయ్యారు. మరో వైపు పురుషుల సింగిల్స్ లో కే శ్రీకాంత్ ఫైనల్ కు చేరాడు.