: మే 3న కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ కేసుల విచారణ


2012లో నిరసనల సందర్భంగా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇతర నాయకులకు సంబంధించిన ఐదు కేసులను విచారించేందుకు ఢిల్లీ న్యాయస్థానం మే 3వ తేదీని ఖరారు చేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంపై ప్రధాని మన్మోహన్, యూపీఏ ఛైర్మన్ సోనియా గాంధీ నివాసాలకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించారంటూ కేజ్రీవాల్, మరికొందరిపై అభియోగాలు నమోదయ్యాయి.
శనివారం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ధీరజ్ మిట్టల్ ఎదుట హాజరైన నిందితుల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించేందుకు తమ ప్రధాన న్యాయవాది రాహుల్ మెహ్రా రాలేకపోయినందుకు కేసు విచారణను మే 3వ తేదీకి నిర్ణయించాలని కోర్టును కోరారు. వ్యక్తిగతంగా కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేజ్రీవాల్ తో పాటు, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఇతర నిందితుల అభ్యర్థనను ఇవాళ ఒక్కరోజుకు మాత్రం న్యాయస్థానం అనుమతించింది.

  • Loading...

More Telugu News