: దేశానికి స్థిరమైన ప్రభుత్వాన్ని బీజేపీయే ఇవ్వగలదు: రాజ్ నాథ్ సింగ్


సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చాలా విశ్వాసంతో ఉంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. కేవలం బీజేపీయే దేశానికి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలదని ఆయన అన్నారు. ఆ సామర్ధ్యం ఒక్క ‘కమలా’నికే ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 272కు పైగా లోక్ సభ సీట్లను గెలుచుకుంటుందని రాజ్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News